పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యాడా? పవన్ వద్దకు కుల పంచాయితీ!
on Nov 11, 2024
రచయితగా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పని చేసిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)ఆ పై నటుడుగా,నిర్మాతగా, దర్శకుడుగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 2009 లో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రని పోషిస్తున్నాడు.
మొన్న మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) పై పోసాని అనుచిత వ్యాక్యలు చేసాడు.సభ్య సమాజం తలదించుకునేలా పవన్ తల్లిని,భార్యని, పిల్లల్ని పోసాని తిట్టిన తీరు అందర్నీ షాక్ కి గురి చేసింది.దీంతో అప్పట్లోనే జనసేన నాయకులు, పవన్ అభిమానులు చాలా ఏరియాల్లోని పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ అప్పటి వైసిపీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా రాజమండ్రి కి చెందిన జనసేన నాయకులు తమ నాయకుడ్ని తిట్టినందుకు పోసాని పై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు తదుపరి చర్యలకి సిద్దమవుతున్నారని తెలుస్తుంది
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఆయన కుటంబంపై కూడా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసాడని కూడా జనసేన నాయకులు తమ కంప్లైంట్ లో పొందుపరిచారు.భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సైకోల్లా, రక్తం తాగే రాక్షుసుల్లా చంద్రబాబు, పవన్,లోకేష్ లపై పోస్ట్ లు చేసిన సోషల్ మీడియా యాక్టీవిస్ట్ ల ని అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ కూడా ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో సినీ కులం ఏమంటుందో చూడాలి.