డ్రగ్ కేస్‌లో వివేక్ ఓబరాయ్ భార్యకు నోటీస్.. ఎందుకంటే?
on Oct 16, 2020

శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్ కేసులో గురువారం ముంబైలోని బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబరాయ్ ఇంటిలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతని బావమరిది ఆదిత్య ఆళ్వా కోసం గాలించారు. ఒక రోజు తర్వాత, అంటే శుక్రవారం వివేక్ భార్య ప్రింయాక ఆళ్వాకు వారు నోటీస్ జారీ చేశారు. ఆదిత్య ఆళ్వా కోసం లుకౌట్ నోటీస్ జారీ చేసిన దాదాపు మూడు వారాల తర్వాత అతని సోదరి ప్రియాంకకు వారు నోటీస్ జారీ చేయడం గమనార్హం.
దివంగత మాజీ మంత్రి జీవరాజ్ ఆళ్వా కుమారుడు, బాలీవుడ్ యాక్టర్ బావమరిది అయిన ఆదిత్య ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. శాండల్‌వుడ్ డ్రగ్ కేస్ వెలుగులోకి వచ్చి, కొంతమంది సెలబ్రిటీల అరెస్టులు జరిగినప్పట్నుంచీ అతను అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఆ డ్రగ్ కేసులో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పోలీసులు ఇంతకుముదు ఆదిత్య ఆళ్వాకు చెందిన ప్రాపర్టీస్‌ను సెర్చ్ చేసింది. వాటిలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు అతడిచ్చే వీకెండ్ పార్టీలకు వేదికైన రిసార్ట్ కూడా ఉంది. శాండల్‌వుడ్ డ్రగ్ కేస్ కన్నడ చిత్రసీమలోని పలువురి బండారాన్ని బయటపెట్టింది. సంజన, రాగిణి ద్వివేది లాంటి తారలు ఈ కేసులో చిక్కుకొని, ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



