కిరణ్ తో పెళ్లి చాందినికి 'సమ్మతమే'నా!
on Jun 16, 2022

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా 'సమ్మతమే'. గోపినాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'సమ్మతమే' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చిన్నప్పుడే తల్లి మరణించడంతో.. "ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మి" అని తండ్రి చెప్పిన మాటని పట్టుకొని.. స్కూల్ ఏజ్ నుంచే పెళ్లి గురించి కలలు కంటుంటాడు హీరో కిరణ్. పెద్దయ్యాక హీరోయిన్ చాందినిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. మొదట వారి ప్రయాణం సరదాగా సాగిపోతున్నట్లు కనిపించినా తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. మొత్తానికి కామెడీ, ఎమోషన్ కలగలిసిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.
కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్ కాగా, విప్లవ్ నైషధం ఎడిటర్. హీరోగా చేసిన మొదటి రెండు సినిమాలు 'రాజా వారు రాణి గారు', ''ఎస్ఆర్ కళ్యాణమండపం'తో విజయాలను అందుకున్న కిరణ్.. మూడో సినిమా 'సెబాస్టియన్'తో నిరాశపరిచాడు. 'సమ్మతమే'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



