జూలైలో హిట్ కాంబినేషన్స్.. 8 ఏళ్ళ నాటి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా!
on Jun 16, 2022

2022 జూలైలో రెండు హిట్ కాంబినేషన్స్.. ఎనిమిదేళ్ళ తరువాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. రెండు వారాల వ్యవధిలో రాబోతున్న ఆ కాంబినేషన్స్ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య - విక్రమ్ కుమార్ః
2014లో విడుదలైన `మనం` చిత్రం కోసం తొలిసారిగా కలిసి పనిచేశారు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్. అక్కినేని మూడు తరాల కథానాయకులతో రూపొందిన ఈ సినిమాలో తన తాత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, తండ్రి కింగ్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చైతూ. సదరు చిత్రంతో ఓ మెమరబుల్ హిట్ ని క్రెడిట్ చేసుకున్నారు. కట్ చేస్తే.. `మనం` తరువాత మళ్ళీ ఇప్పుడు `థాంక్ యూ` కోసం విక్రమ్ తో ఇంకోసారి జట్టుకట్టారు చైతూ. జూలై 8న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రాబోతోంది.
నిఖిల్ - చందు మొండేటిః
2014లో రిలీజైన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ `కార్తికేయ` కోసం మొదటిసారిగా కలిసి పనిచేశారు యంగ్ హీరో నిఖిల్ - టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి. ఫస్ట్ కాంబినేషన్ లోనే ఈ ఇద్దరు బ్లాక్ బస్టర్ ని మూటగట్టుకున్నారు. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు `కార్తికేయ` సీక్వెల్ `కార్తికేయ 2` కోసం ఈ కాంబో రిపీట్ అవుతోంది. జూలై 22న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వస్తోంది.
మరి.. జూలై నెల వేదికగా 2014 నాటి ఈ హిట్ కాంబినేషన్స్ (చైతూ - విక్రమ్, నిఖిల్ - చందు) మరోసారి మెస్మరైజ్ చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



