సాయిధరమ్ తేజ్ ట్వీట్ పై ఫ్యాన్స్ ఖుషి.. నిలబడడానికే పుట్టాను
on Sep 9, 2025

సుప్రీంహీరో 'సాయిధరమ్ తేజ్'(Sai Dharam tej)సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది. 2023 లో 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో కలిసి 'బ్రో' చేసిన తర్వాత 'సత్య' అనే షార్ట్ ఫిలింలో చేసాడు. ప్రస్తుతం 'సంబరాల యేటిగట్టు'(Sambarala yeti Gattu)అనే మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో 'హనుమాన్' మేకర్ నిరంజన్ రెడ్డి(Niranjan Reddy)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'సంబరాల ఏటి గట్టు' ఏ తరహా సబ్జెట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 25 అని రిలీజ్ డేట్ ప్రకటించడంతో మేకర్స్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటు వచ్చారు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ ని కూడా ఎప్పటికప్పుడు తెలియచేస్తు వస్తున్నారు. కానీ కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో చిత్రీకరణ అపారనే టాక్ సోషల్ మీడియాలో బాగానే వినిపించింది. మేకర్స్ కూడా ఆ వార్తలపై స్పందించకపోవడంతో, షూటింగ్ ఆగిపోయిందనే అందరు అనుకున్నారు. ఇప్పుడు ఆ వార్తలకి చెక్ పడింది. సంబరాల ఏటిగట్టు క్రూషియల్, పవర్ ప్యాక్డ్ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మిడ్ నుంచి మొదలు కానుందని మేకర్స్ అధికారంగా ప్రకటించారు.
సాయి ధరమ్ తేజ్ కూడా ఎక్స్ వేదికగా 'సంబరాల ఏటిగట్టు' లోని తన పిక్ ని షేర్ చేస్తు 'గందరగోళంలో కూడా నిలబడటానికి పుట్టాను' అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసాడు. నూతన దర్శకుడు రోహిత్ కే పి దర్శకత్వం వహిస్తుండగా, 100 కోట్లకి పైగా బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఐశ్వర్య లక్షి(Aishwrya Lekshmi)కధానాయికిగా కనిపిస్తుండగా,జగపతి బాబు సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాద్(Ajaneesh Loknath)సంగీతాన్ని అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



