సమంత పై సాయిథరమ్ తేజ్ ఇంట్రస్టింగ్ కామెంట్...
on Aug 15, 2017

సమంత, నాగచైతన్య ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రేమ కాస్త పరిణయంగా మారి.. అక్టోబర్ 6న వివాహం కూడా జరగనుంది. అయితే ఇప్పుడు సమంత గురించి సాయిథరమ్ తేజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాయిథరమ్ తేజ్ కు సమంత అంటే చాలా ఇష్టమని తెలుసు. పలు ఇంటర్వ్యూల్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగితే సమంత అని చెప్పేవాడు. అలాగే హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని కొంతమందితో ముచ్చటించిన ఆయన సమంత గురించి మాట్లాడుతూ... తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని, చాలా బాగుంటుందని, సమంతకు నాగచైతన్య ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని నవ్వుతూ అన్నాడు. ఇంకా తనకు ఇష్టమైన హీరోల గురించి చెబుతూ.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అని.. మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే రవితేజతో కలిసి నటిస్తానని చెప్పుకొచ్చాడు. మరి ఒకవేళ నాగచైతన్య లేకపోతే సాయిథరమ్ తేజ్ కు సమంత ఓకే చెప్పాదో..?లేదో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



