మెగా అభిమానులకు మెగా గిఫ్ట్..
on Aug 15, 2017
మెగా అభిమానులకు, మెగా గిఫ్ట్ ఇవ్వనున్నారా.. అంటే అవుననే వినిపిస్తుంది టాలీవుడ్ టాక్. తన 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తరువాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు ఫిక్స్ అయ్యారు. అయితే సినిమా టైటిల్ అయితే ముందే చెప్పారు కానీ.. ఇంతవరకూ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.. అయితే ఇప్పుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు అదే రోజు సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందన్నటాక్ వినిపిస్తుంది. దీనికి తోడు టైటిల్ ను కూడా మార్చాలని అనుకుంటున్నారట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బదులు మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను భారీగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోసారి రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రూపొందించనున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
