సమంత.. కొబ్బరికాయ.. ఓ కథ!
on Jun 5, 2020
.jpg)
కొంతమంది కొన్ని పనులను ఎప్పటికీ నేర్చుకోలేరని స్టార్ హీరోయిన్ సమంత అంటున్నారు. ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటంటే... ఓ పని చేయడం ఇప్పటికీ చేత కావడం లేదు. నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ... ప్రతిసారీ విఫలమవుతున్నారు. తనకు కొబ్బరికాయ కొట్టడం రాదని ఆమె సెలవిచ్చారు. ఇంతకీ, సమంతకు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిదంటే... ఆవు, గేదె పాలు కాకుండా కొబ్బరికాయ కొట్టి, అందులో కొబ్బరితో చేసిన పాలను ఉపయోగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకని, కోకోనట్ బ్రేక్ చేయాలని ప్రయత్నించగా, ఆమె ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి.
‘‘ఇప్పటికీ నేను కొబ్బరికాయ పగలకొట్టలేను. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ, ప్రయోజనం లేదు. దగ్గర దగ్గరగా 50 సినిమాలకు చేరువ అయ్యా. యాభై సార్లు కొబ్బరికాయ కొట్టడం ప్రాక్టీస్ చేశా. అయినా సరిగా రావడం లేదు. ఫెయిల్ అవ్వడంలో పాస్ అవుతున్నా’’ అని సమంత అన్నారు. ఇటీవల ఆమె మిద్దె వ్యవసాయం (రూఫ్ గార్డెనింగ్) ప్రారంభించిన సంగతి తెలిసిందే. వ్యవసాయం చేయడం వల్ల ఒక భోజనం టేబుల్ మీదకు రావడానికి ఎంత కృషి అవసరమో తనకు తెలిసిందని సమంత తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



