రజనీకాంత్‌కి కరోనా వచ్చిందన్నాడు!
on Jun 5, 2020

హిందీ టీవీ సీరియల్ యాక్టర్ రోహిత్ రాయ్‌కి ఏది జోక్ చేసే విషయమో? ఏది కాదో? తెలిసినట్టు లేదు. జోకులు వేసేటప్పుడు ముందూ వెనుకా చూసుకోవాలి. లేకపోతే ఎదుటివాళ్లు నవ్వకపోగా గట్టిగా గడ్డి పెడతారు. ఈ సంగతి కాస్త ఆలస్యంగా అతడికి అర్థమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. లేకపోతే... సూపర్‌స్టార్, తమిళ తలైవా రజనీకాంత్‌కి కరోనా వచ్చిందని చెప్పడం ఏంటి?
అసలు వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం ‘‘రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ క్వారంటైన్‌లో ఉన్నారు’’ అని రోహిత్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతడు ఫేమస్ కాకపోవడంతో సౌతిండియన్ ఆడియన్స్‌కి ముందుగా అతడి పోస్టు గురించి తెలియలేదు. నార్త్ ఇండియాలోనూ రజనీకాంత్‌కి అభిమానులు ఉన్నారు కదా! వాళ్లలో కొందరు ఈ పోస్టు చూశారు. జోక్ చేసే విషయమా ఇది? అని తిట్టడం మొదలుపెట్టారు. దాంతో అసలు విషయం రోహిత్ రాయ్‌కి అర్థమైంది.
‘‘శాంతించండి. జోక్‌ను జోక్‌గా చూడండి. ఇదేమంత చెత్త జోక్ అనుకోవడం లేదు. రజనీకాంత్ స్టైల్ టిపికల్ జోక్. అందర్నీ నవ్వించడమే నా ఉద్దేశం. కామెంట్ చేసే ముందు నా ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరందరూ నన్ను వేధిస్తున్నట్టు, నేను ఎవరినీ బాధపెట్టాలని, వేధించాలని అనుకోలేదు’’ అని రోహిత్ రాయ్ వివరణ ఇచ్చుకున్నాడు. అప్పటికే ఆలస్యమైంది. అతడిని రజనీకాంత్ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు. ఇంకా వదిలిపెట్టలేదు. ట్రోల్స్ వస్తూ ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



