చైతూతో విడిపోయాక తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కు వచ్చిన సమంత!
on Nov 25, 2021

నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత కెరీర్ విషయంపై పూర్తి ఫోకస్ పెట్టింది సమంత. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలకు సంతకాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఆమె తెలుగులో గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం'ను పూర్తి చేసింది. ఈ మూవీలో ఆమె శకుంతలగా కనిపించనున్నది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఆమె అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉంది. అవును. 'శాకుంతలం'లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి అక్కడకు వచ్చింది. ఆ సినిమా డబ్బింగ్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరుగుతున్నాయి. దీంతో తన వృత్తిలో భాగంగా అక్కడకు వచ్చి డబ్బింగ్ చెప్తోంది సమంత.
చైతూ నుంచి విడిపోయినట్లు ప్రకటించాక సమంత అన్నపూర్ణ స్టూడియోస్‌కు రావడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడి సిబ్బంది ఆమెను ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి ఆమె స్టూడియోకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. 'శాకుంతలం'పై సమంత చాలా ఆశలే పెట్టుకుంది. సినిమా కథ అంతా ఆమె పాత్ర చుట్టూ నడిచేది కావడంతో, డబ్బింగ్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోందామె.
చైతూకు సమంత బర్త్‌డే విషెస్ చెప్పలేదు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
మరోవైపు ఆమె తమిళంలో 'కాదు వాకుల రెండు కాదల్' అనే మూవీని నయనతార, విజయ్ సేతుపతితో కలిసి చేస్తోంది. అలాగే 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్‌తో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తోంది సమంత. వీటి తర్వాత రెండు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్‌కు సంతకాలు చేసింది. బాలీవుడ్‌లో తాప్సీ నిర్మించే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించేందుకు రెడీ అవుతోంది.
ప్రీతమ్‌తో కలిసి రచ్చ చేసిన సమంత
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



