సల్మాన్ రహస్యాన్ని చెప్పేస్తాడట..!
on May 13, 2016

రెండు దశాబ్దాలుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎవరైనా ఉన్నారంటే అది సల్మాన్ ఖాన్ అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఎప్పటినుంచో మనోడి పెళ్లి గోల సా..గుతూనే ఉంది. ఈ రెండు దశాబ్దాల్లో చాలా పేర్లు సల్మాన్ లవర్ కేటగిరీకి వచ్చి వెళ్లిపోయాయి. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నట్టుగా, సల్లూభాయ్ కు వాళ్లెవరితోనూ పెళ్లి యోగం లేదు. సల్మాన్ తోటి వాళ్లందరూ మనవళ్ల కోసం రెడీ అయిపోతుంటే, ఈయన మాత్రం ఇంకా పెళ్లికొడుకు కూడా అవలేదు. ఎట్టకేలకు ఈ ముదురు బ్యాచిలర్ కు పెళ్లి ఘడియలు సమీపించినట్టే కనబడుతోంది. గత కొంతకాలంగా సల్మాన్, రొమానియా మోడల్ లూలియా వంతూర్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ పాప ఇప్పటికే సల్లూ భాయ్ కుటుంబంతో కూడా చాలా క్లోజ్ అయిపోయింది. అయితే వీళ్లిద్దరి బంధాన్ని ఇప్పటివరకూ సల్మాన్ అఫీషియల్ గా ప్రకటించలేదు. త్వరలో జరగనున్న ప్రీతీజింతా రిసెప్షన్ లో లూలియాతో తన ప్రేమను ప్రకటిస్తాడట సల్లూభాయ్. ఇన్నాళ్లూ ఆమెను సినీ పరిశ్రమలోని వ్యక్తులకు కూడా తెలియకుండా తమ బంధాన్ని సీక్రెట్ గా మెయింటెయిన్ చేసిన సల్మాన్, ఆమెను పరిచయం చేయడమే కాక, త్వరలోనే పెళ్లాడతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టకేలకు సల్మాన్ ఒక ఇంటివాడౌతాడన్నది అతని అభిమానులకు శుభవార్తే మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



