కబాలీ ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో..!
on May 13, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి ఇంకా రిలీజే కాలేదు. కానీ అప్పుడే ఎన్నో రికార్డులను బద్ధలుకొడుతూ రజనీ పవర్ చూపిస్తోంది. విడుదలైన 22 గంటల్లోనే 50 లక్షలకు పైగా హిట్స్ సంపాదించిన కబాలీ టీజర్ మరో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ టీజర్ ను కోటీ 71 లక్షల మంది చూశారు. దీంతో యూట్యూబ్ చరిత్రలో ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన టీజర్లలో టాప్ 50లోకి చేరుకుంది కబాలీ. ఇక ఇండియా వైడ్ రికార్డ్స్ అయితే లెక్కే లేదు. ఇండియా యూట్యూబ్ లో కబాలీ టీజరే నెంబర్ వన్. కబాలీ స్ట్రోక్ కు ధూమ్ 3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ టీజర్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. కబాలీ రా అంటూ రజనీ చెప్పిన డైలాగ్, ఆయన ఫ్యాన్స్ కు ఎక్కడ లేని ఎనర్జీ ఇచ్చింది. టీజర్ ఎండింగ్ లో జుట్టు పక్కకు అనుకుంటూ రజనీ వచ్చే సీన్ అయితే విజిల్స్ కొట్టిస్తోంది. సినిమాలో తన రియల్ లైఫ్ వయసున్న పాత్రను రజనీ చేస్తున్నారు. పా రంజిత్ డైరెక్ట్ చేసిన కబాలీలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తోంది. టీజర్ కే ఇలా ఉంటే, ఇక సినిమా ఎఫెక్ట్ ఎలా ఉంటుందోనంటూ రజనీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



