సిఎం కు సల్మాన్ ఖాన్ థ్యాంక్స్..!
on Apr 30, 2016

యూపీ సిఎం అఖిలేష్ యాదవ్ కు సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశాడు. సల్మాన్ లేటెస్ట్ సినిమా సుల్తాన్ మెజారిటీ షూటింగ్ ను ఉత్తరప్రదేశ్ లోనే జరిపారు. ఈ సందర్భంగా తనకు, తన మూవీ టీం కు సహకరించినందుకు యూపీ సిఎం అఖిలేష్ కు, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు సల్మాన్. అక్కడి పోలీసులు అందించిన సహాయం కారణంగా షూటింగ్ అద్భుతంగా జరిగిందని ట్వీటాడు సల్లూ భాయ్. సుల్తాన్ విషయానికొస్తే, ఇది ఒక మల్లయోధుడి కథ. సినిమాలో సల్మాన్ తో పాటు, అనుష్క శర్మ కూడా మల్లయుద్ధాలు చేయడం విశేషం. అలీ అబ్జాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన సుల్తాన్ కు, ఆదిత్య చోప్రా నిర్మాత. సినిమాను జులైలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ టీం. ఇప్పటికే రీలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



