చిరు 150 సస్పెన్స్ విప్పిన వినాయక్..!
on Apr 30, 2016

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కామా పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోవడంతో, తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన చేసి, కత్తి రీమేక్ తో సుముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. అయితే చాలా మందికి ఉన్న డౌట్, ఈ సినిమాతో, తన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా చిరు డైలాగులు రాయించుకుంటారా..? పాలిటిక్స్ ను తన సినిమాలో టచ్ చేస్తారా..? పొలిటికల్ మైలేజీ పొందే ప్రయత్నం చేస్తారా..? సినిమా దర్శకుడు వినాయక్ ఈ సస్పెన్స్ కు తెరదించాడు. సినిమా కేవలం ఠాగూర్ తరహాలో సమాజానికి మంచి చెప్పేలా ఉంటుందే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజకీయాల్ని టచ్ చేయట్లేదని కుండ బద్ధలుగొట్టేశాడు వినాయక్. పక్కా కమర్షియల్ మూవీగా చిరు తరహా ఫైట్స్, డ్యాన్సులతో పూర్తి ఎంటర్ టైన్మెంట్ తో మూవీ ఉంటుందని క్లియర్ గా చెప్పేశాడు. కానీ ఎంత కాదనుకున్నా, ఇన్ డైరెక్ట్ గానైనా, చిరు పంచ్ లు సంధిస్తారని జనాల ఒపీనియన్. చిరు సినిమా ఎలా ఉండబోతుందా తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ ఎయిటింగ్ సెయ్యక తప్పదు మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



