ENGLISH | TELUGU  

సాయిప‌ల్ల‌వి నా చెల్లెలిగా న‌టించ‌నని చెప్పేసింది.. నేనూ అదే కోరుకున్నా!

on Sep 19, 2021

 

'ల‌వ్ స్టోరి' హీరోయిన్ సాయిప‌ల్ల‌విని ఒక‌వైపు సున్నితంగా దెప్పిపొడుస్తూ, ఇంకోవైపు విప‌రీతంగా పొగిడేశారు మెగాస్టార్ చిరంజీవి. త‌న 'భోళా శంక‌ర్‌' ('వేదాళ‌మ్' రీమేక్‌) సినిమాలో త‌న చెల్లెలి పాత్ర‌ను ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు, తిర‌స్క‌రించింద‌నే విష‌యాన్ని బాహాటంగా ఆయ‌న‌ చెప్పేశారు. స‌ల‌వ్ స్టోరిస‌ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన చిరంజీవి, త‌న స్పీచ్‌లో అంద‌రికంటే ఎక్కువ‌గా సాయిప‌ల్ల‌వి గురించే మాట్లాడారు.

"సాయిప‌ల్ల‌విని నేను ఫ‌స్ట్ టైమ్ నేను మా వ‌రుణ్ తేజ్ సినిమా 'ఫిదా'లో చూశాను. అప్ప‌టిదాకా సాయిప‌ల్ల‌వి ఎవ‌రో నాకు తెలీదు. ఆ సినిమాలో సాంగ్‌లో ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ స్టెప్స్ కానీ చూస్తుంటే, 'ఎవ‌రీ అమ్మాయి. షి మ‌స్ట్ బి వెరీ గుడ్ డాన్స‌ర్‌. ఏంటా ఎన‌ర్జీ, ఏంటా స్మైల్' అంటూ స్ట‌న్న‌యి చూశాను. వెంట‌నే వ‌రుణ్ వ‌చ్చాడు, 'డాడీ.. ఎలా చేశాను, బాగా చేశానా' అని అడిగాడు. 'సారీరా నిన్ను చూడ‌లేదు, సాయిప‌ల్ల‌విని చూస్తుండిపోయాను.' అని చెప్పాను." అని ఆయ‌న అన్నారు.

"అయితే ఈమ‌ధ్య ఒక సినిమాలో (భోళా శంక‌ర్‌) నా ప‌క్క‌న వెరీ ప‌వ‌ర్‌ఫుల్ సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌కు సాయిప‌ల్ల‌విని మా డైరెక్ట‌ర్ వాళ్లు స‌జెస్ట్ చేయ‌గానే చాలా బాగుంటుంది, త‌న‌తో చేయాల‌నే స‌ర‌దా నాకూ ఉంది" అని అన్నానని చిరు చెప్పారు. "కానీ లోప‌ల ఒప్పుకోక‌పోతే బాగుండు అనుకున్నాను. సరిగ్గా సాయిప‌ల్ల‌వి 'నేను చెయ్య‌ను' అనేసింది. ఎందుకందో, ఏమో నాకు తెలీదు. వారు కార‌ణం చెప్ప‌బోతుంటే, 'వ‌ద్దు, అదే నేను కోరుకున్నాను.. బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ లాగా చెయ్య‌కూడ‌ద‌ని. అంత వండ‌ర్‌ఫుల్ డాన్స‌ర్‌తో నేను డాన్స్ వెయ్యాల‌నుకుంటాను కానీ, చెల్లెమ్మా ఎలా ఉన్నావు అంటే ఎలా'.. థాంక్స్ సాయిప‌ల్ల‌వీ.. నా సినిమాని ఒప్పుకోనందుకు." అని ఆమెను ఉద్దేశించి అన్నారు చిరు.

దాంతో బాగా ఇబ్బందిప‌డ్డ సాయిప‌ల్ల‌వి క‌ల‌గ‌జేసుకొని, "సార్‌. మిమ్మ‌ల్ని క‌లుసుకోవ‌డ‌మే నాకు పెద్ద విష‌యం. నాకు రీమేక్స్ అంటే కొంచెం భ‌యం. అందుకే అది ఒద్ద‌న్నాను. వేరే ఏం లేదు. ప్లీజ్‌, నెక్స్ట్ ఫిల్మ్‌కు న‌న్ను తీసుకోండి." అని చెప్పింది.

"చెల్లెలిగా చేశాక‌, మ‌ళ్లీ నీతో డాన్స్ చెయ్యాలంటే ఎక్క‌డో మ‌న‌సొప్ప‌దు. అలా కాదు, రొమాంటిక్ హీరోయిన్‌గా నా ప‌క్క‌న చేయ‌గ‌లిగితే.. ఒప్పుకుంటే".. అని చిరంజీవి అన‌డంతో, ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన సాయి, "అయ్యో సార్‌.. అది నాకు గౌర‌వం" అని చెప్పింది. "ఇదివ‌ర‌కు రాధ‌తో యాక్ట్ చేసేట‌ప్పుడు, ఆమెతో డాన్స్ చేస్తుంటే చాలా కిక్ వ‌చ్చేది. అలాగే రంభ‌తో.. శ్రీ‌దేవితో కూడా. ఆమెకు వేరే స‌బ్‌స్టిట్యూట్ ఎవ‌రూ లేరు. వాళ్ల‌తో చేస్తుంటే చాలెంజింగ్ అనిపించేది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సాయిప‌ల్ల‌విని చూశాకే, ఈ అమ్మాయితో డాన్స్ చేసి, నేను కూడా డాన్స‌ర్‌న‌ని నిరూపించుకోవాల‌నిపించింది." అని తెగ పొగిడేశారు చిరంజీవి. సాయితో డాన్స్ చేయ‌డానికి నాగ‌చైత‌న్య క‌ష్ట‌ప‌డి వుంటాడ‌ని కూడా ఆయ‌న అంటే, నిజ‌మేన‌ని చైతూ ఒప్పుకున్నాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.