కరోనా ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన 'విరాటపర్వం'!
on Apr 14, 2021

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు ఒక్కో సినిమా విడుదల అనివార్యంగా వాయిదా పడుతూ వస్తోంది. 'లవ్ స్టోరి', 'టక్ జగదీష్' సినిమాల తర్వాత ఇప్పుడు 'విరాటపర్వం' విడుదల సైతం ఆగింది. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా వేణు ఊడుగుల రూపొందిస్తోన్న చిత్రం 'విరాటపర్వం'. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో, ఇంతవరకూ చూడని సరికొత్త పాత్రలలో రానా, సాయి పల్లవి కనిపించే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో పాటు ఇటీవల విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ సాధించింది.
90వ దశకంలో జరిగిన యథార్థ ఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రను రానా పోషిస్తున్నాడు. అతను తన కలంపేరు 'అరణ్య'గా ప్రసిద్ధి. వెన్నెల అనే పాత్రలో అతని ఆరాధకురాలిగా సాయిపల్లవి కనిపించనుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా 'విరాటపర్వం' తెరకెక్కుతోంది.
దేశవ్యాప్తంగా తీవ్రతరమవుతున్న కరోనా వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన 'విరాటపర్వం' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివల్యూషన్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనేది ట్యాగ్‌లైన్. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సంయుక్తంగా సినిమాటోగ్రఫీ భాధ్యతలు నిర్వహిస్తున్నారు, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
ఇతర ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



