సాయి పల్లవి నిజంగానే ఆకాశంలో ఒక తార
on Nov 2, 2024

సాయి పల్లవి(sai pallavi)ప్రస్తుతం అమరన్(amaran)మూవీ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. దివంగత మేజర్ ముకుంద్ వరద రాజన్(major mukund varada rajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రంలో ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని విశేషంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆమె మరో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్(dulquer salmaan)హీరోగా 'ఆకాశంలో ఒక తార'(akasamlo oka tara)అనే మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలోనే దుల్కర్ సల్మాన్ కి జోడిగా సాయి పల్లవి చేయబోతుంది. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ తో దుల్కర్, అమరన్ తో సాయి పల్లవి హిట్ ని అందుకున్నారు.పైగా ఇద్దరు మలయాళీ ఆర్టిస్టులు కూడా కావడంతో ఆ ఇద్దరి కాంబో క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది.
ప్రేమ్ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి చిత్రాలని తెరకెక్కించిన పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార, ని వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ తో కలిసి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం లు నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



