నాగచైతన్య కి పోటీగా సాయి పల్లవి రెమ్యునరేషన్ !
on Nov 29, 2023
భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోలకి ధీటుగా రాణించే హీరోయిన్లు అతి కొద్దీ మంది మాత్రమే ఉంటారు. హీరోని చూసి ఆడియన్స్ థియటర్స్ కి వెళ్ళినట్టే హీరోయిన్ ని చూసి కూడా థియేటర్స్ కి వెళ్లేలా చేసే హీరోయిన్లు అతి కొద్దీ మంది మాత్రమే ఉంటారు. అలాంటి అతి కొద్దీ మంది హీరోయిన్లలో ఒకరు సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన సాయి పల్లవి ఇప్పుడు హీరోలకి ధీటుగా పారితోషకం డిమాండ్ చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.
సాయి పల్లవి ప్రస్తుతం గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీ తండేల్ లో నటిస్తుంది. ఈ సినిమాకి 3 కోట్ల పారితోషకాన్ని సాయి పల్లవి డిమాండ్ చేసింది. చిత్ర యూనిట్ కూడా ఆమె కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. సాయి పల్లవి తమ చిత్రంలో ఉంటే చాలు ఆడియన్స్ థియేటర్స్ కి పరుగులు పెడతారనే విషయం మేకర్స్ కి బాగా తెలుసు.అందకే ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తండేల్ కి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
సినిమా కథ నచ్చి ఆ కథ లో తన క్యారక్టర్ కి గుర్తింపు ఉంటేనే సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. అంతే కానీ ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చెయ్యదు. అందుకే గార్గి తర్వాత తనకి చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చిన చెయ్యలేదు. ఇప్పుడు తండేల్ కాకుండా సాయి పల్లవి చేతిలో ఇంకో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తమిళంలో శివ కార్తికేయన్ సినిమాతో పాటు హిందీ లో తెరకెక్కే రామాయణంలో కూడా సాయి పల్లవి నటించబోతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
