'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఎఫెక్ట్.. మా థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి!
on Dec 8, 2021

మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ గురువారం(డిసెంబర్ 9 న) విడుదల కానున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించనున్నారు. అయితే ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఒకేసారి థియేటర్స్ కి క్యూ కడితే తమ పరిస్థితి ఏంటంటూ థియేటర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సర్ ప్రైజ్.. గోండు బెబ్బులి లుక్ అదిరింది!
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ప్రదర్శించే సమయంలో తమ థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలంటూ వైజాగ్ సంగం-శరత్ థియేటర్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ట్రైలర్ ను మా ట్విన్ థియేటర్స్ ప్రదర్శిబోతున్నామని, దీనికి ఇద్దరు హీరోల అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముంది కాబట్టి, డిసెంబర్ 9 న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ట్విన్ థియేటర్స్ కి ప్రొటెక్షన్ కావాలని థియేటర్స్ యాజమాన్యం కోరింది.

Also Read: 'అల్లూరి'గా రామ్ చరణ్ గర్జన!
కాగా, గతంలో ఇదే థియేటర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' ట్రైలర్ ప్రదర్శించగా అభిమానుల తాకిడికి థియేటర్ అద్దాలు పగిలిపోయాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని థియేటర్ యాజమాన్యం ఈసారి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో భారీ ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివస్తారని భావించిన యాజమాన్యం సెక్యూరిటీ కోసం పోలీసులను ఆశ్రయించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



