'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో నిలిచేది ఆ కేటగిరిలోనేనా!
on Dec 13, 2022
.webp)
అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేసులో నిలిచింది. రెండు విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులను 2023, జనవరి 10న ప్రకటిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో రెండు విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్స్ దక్కించుకుంది. అందులో ఒకటి బెస్ట్ పిక్చర్(నాన్ ఇంగ్లీష్) కాగా, రెండోది బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు). ఈ రెండు విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్' గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
.webp)
మరోవైపు 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆస్కార్ నామినేషన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ తో పాటు నటన, సంగీతం పలు వంటి విభాగాల్లో నామినేషన్స్ సాధిస్తామని నమ్ముతోంది. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ ని బట్టి చూస్తే.. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్'గా 'నాటు నాటు' మాత్రమే ఆస్కార్ నామినేషన్ దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



