సూర్య, లోకేష్ కాంబోలో త్వరలో 'రోలెక్స్' మూవీ!
on Dec 13, 2022

'ఖైదీ', 'మాస్టర్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక ఈ ఏడాది విడుదలైన 'విక్రమ్'తో దర్శకుడిగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఆ చిత్రం అంచనాలకు మించి సంచలన విజయాన్ని అందుకుంది. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్రలు ఆకట్టుకుంటాయి. ఇక రోలెక్స్ అనే ప్రత్యేక పాత్రలో సూర్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ డ్రగ్ మాఫియా డాన్ గా సూర్య కనిపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సూర్యను పూర్తిస్థాయిలో ఆ పాత్రలో చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్యతో త్వరలో 'రోలెక్స్' మూవీ చేయబోతున్నాడు లోకేష్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో తను చేయబోయే సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యల చేశాడు. ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత కార్తీతో 'ఖైదీ-2', కమల్ హాసన్ తో 'విక్రమ్' సీక్వెల్ ఉంటాయని చెప్పాడు. అలాగే 'విక్రమ్'లో సూర్య పోషించిన 'రోలెక్స్' పాత్ర నేపథ్యంలో కూడా ఒక సినిమా ఉంటుందని తెలిపాడు. ఇవన్నీ మల్టీ యూనివర్స్ లో భాగమేనని, అయితే వీటిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఇప్పుడే చెప్పలేమని లోకేష్ అన్నాడు. 'రోలెక్స్' పాత్రతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని లోకేష్ చెప్పడంతో సూర్య ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



