జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' రికార్డుల మోత.. 'ముత్తు', 'బాహుబలి-2'ని మించేలా కలెక్షన్స్!
on Nov 18, 2022

జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' జోరు కొనసాగుతోంది. ఇప్పటికే కేవలం 17 రోజుల్లోనే 185 మిలియన్ యెన్స్ రాబట్టి జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాలుగు వారాల్లోనే 250 మిలియన్ యెన్స్ మార్క్ అందుకొని సత్తా చాటింది. జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' మూవీ 'బాహుబలి-2'ని మించిన జోరు చూపిస్తోంది.
జపాన్ లో 250 మిలియన్ యెన్స్ మార్క్ ని అందుకోవడానికి 'బాహుబలి-2'కి ఏకంగా 32 వారాలు పడితే.. 'ఆర్ఆర్ఆర్' కేవలం నాలుగు వారాల్లోనే ఆ ఫీట్ సాధించడం విశేషం. నాలుగు వారాల్లో ఈ చిత్రం 255 మిలియన్ యెన్స్(రూ.14.9 కోట్ల గ్రాస్) రాబట్టింది. 'ఆర్ఆర్ఆర్' జోరు చూస్తుంటే త్వరలోనే 300 మిలియన్ యెన్స్ క్లబ్ లో చేరేలా ఉంది.
జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో 400 మిలియన్ యెన్స్ తో 'ముత్తు' మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 300 మిలియన్ యెన్స్ తో 'బాహుబలి-2' ఉంది. ప్రస్తుతం 255 మిలియన్ యెన్స్ తో మూడో స్థానంలో ఉన్న 'ఆర్ఆర్ఆర్' త్వరలోనే 'బాహుబలి-2' ని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుల్ రన్ లో 'ముత్తు'ని దాటేసి మొదటి స్థానానికి వెళ్లినా ఆశ్చర్యంలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



