'ఆదిపురుష్'లో రావణుడి గెటప్‌ను మార్చేస్తున్నారు!
on Nov 18, 2022

ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ బడ్జెట్ పెరిగింది. ఇదివరకు ఈ సినిమా కోసం నిర్మాతలు కేటాయించిన బడ్జెట్ రూ. 450 కోట్లు కాగా, ఇప్పుడు ఆ బడ్జెట్ రూ. 550 కోట్లకు పెరిగిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ అని తెలుస్తోంది. రామాయణ గాథ ఆధారంగా ఓం రౌత్ డైరెక్ట్ చేస్తోన్న 'ఆదిపురుష్'లో శ్రీరామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురునిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మనునిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
ఆమధ్య విడుదల చేసిన టీజర్ వివాదాలకూ, విమర్శలకూ తావిచ్చింది. ఇది లైవ్ యాక్షన్ మూవీలా కాకుండా యానిమేషన్ మూవీలా ఉందని సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రావణునితో సహా పలు పాత్రలు కనిపించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నెట్టింట ట్రోలింగ్ మామూలుగా రాలేదు. ముఖ్యంగా రావణుడి గెటప్‌లో సైఫ్ అలీఖాన్ కనిపించిన తీరు చూసి చాలామంది మండిపడ్డారు. 'రావణుడా.. అల్లావుద్దీన్ ఖిల్జీయా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హనుమంతుని గెటప్, రాముని కాస్ట్యూమ్స్, చెప్పులపై కూడా విమర్శలు వచ్చాయి.
ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచేట్లు ఉందంటూ ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఫలితంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌తో పాటు ప్రభాస్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పొరపాటు గ్రహించిన ఓం రౌత్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాడు. వీఎఫ్ఎక్స్ ద్వారా పాత్రధారుల గెటప్స్, కాస్ట్యూమ్స్‌ను మారుస్తున్నట్లు సమాచారం. దీని కోసమే అదనంగా రూ. 100 కోట్లను కేటాయించారని తెలుస్తోంది. అనుకున్న మార్పుల ప్రకారం టీజర్‌లో కనిపించిన పొడవాటి గడ్డం రావణుడు మనకు కనిపించడు. ఆ గడ్డాన్ని పూర్తిగా తీసివేస్తున్నారట. ఇలా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే రిలీజ్ డేట్‌ను మేకర్స్ మార్చేశారు. మొదట 2023 జనవరి 12న ఈ మూవీని రిలీజ్ చేయాలకున్న విషయం తెలిసిందే. కరెక్షన్స్‌కు ఎక్కువ సమయం కావాల్సి రావడంతో రిలీజ్ డేట్‌ను జూన్ 16కు పోస్ట్‌పోన్ చేశారు.
'ఆదిపురుష్' తెలుగు, హిదీ భాషలతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



