'ఆర్ఆర్ఆర్' మరో సంచలనం.. ఐదు కేటగిరీల్లో నామినేషన్లు!
on Dec 15, 2022

ఆస్కార్ నామినేషన్లకు అడుగు దూరంలో ఉన్న 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. పలు ప్రతిష్టాత్మక అవార్డుల నామినేషన్స్ లో చోటు దక్కించుకుని సత్తా చాటుతోంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో రెండు విభాగాల్లో నామినేట్ అయిన ఈ మూవీ.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఏకంగా ఐదు విభాగాల్లో నామినేట్ అయింది.

అమెరికాకు చెందిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతూ ఏకంగా ఐదు విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారెన్ ల్యాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సాంగ్(నాటు నాటు) విభాగాల్లో నామినేట్ అయింది. మరి ఈ ఐదింటిలో ఎన్ని విభాగాల్లో విన్నర్ గా నిలిచి సత్తా చాటుతుందో చూడాలి. బెస్ట్ సాంగ్ గా 'నాటు నాటు'కి అవార్డు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



