డైరెక్టర్ చేయమన్నారని ఆలోచించకుండా చేసేసా..కానీ తర్వాత చాలా బాధపడ్డా
on Nov 26, 2022

జెమినీ టీవీలో అప్పట్లో వచ్చిన "నవ్వు, నవ్వించు" అనే ప్రోగ్రాం యాంకర్ శ్రీనివాస్ రెడ్డి. ఆయన తర్వాత ఆ ప్రోగ్రాం యాంకరింగ్ అవకాశాన్ని రాకెట్ రాఘవ అందిపుచ్చుకున్నారు. అప్పటినుంచే వాళ్ళ మధ్య ఎంతో అద్భుతమైన బాండింగ్ ఉండేది. కానీ ఒక సందర్భంలో మాత్రం ఇద్దరి మధ్య ఒక చిన్న క్లాష్ వచ్చిందని విన్నాం ఏంటది..అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాఘవ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. "అప్పట్లో జెమినీలో "నవ్వుల సవాల్" అనే ప్రోగ్రాంని శ్రీనివాస్ రెడ్డి చేసేవారు. ఆ విషయం నాకు తెలుసు. ఐతే ఒక రోజు ఈ ప్రోగ్రాం డైరెక్టర్ ఫోన్ చేసి నువ్ ప్రోగ్రాం చేస్తావా వచ్చేయి అన్నారు. నాకూ ఎదగాలని ఉంటుంది కదా ఏమీ తెలియకుండానే ఆయన పిలవగానే ప్రోగ్రాంకి వెళ్లాను.
అప్పటికి ఆ ప్రోగ్రాంని శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు, అదే నేను చేసాను. డైరెక్టర్ పిలవగానే ఏం ఆలోచించకుండా వెళ్లి చేసేసాను. ఒక రోజు శ్రీనివాస్ రెడ్డి గారు సెట్ కి వచ్చారు చూసి వెళ్లిపోయారు. తర్వాత ఒక రోజు ఆయన నన్ను పిలిచి ఈ ప్రోగ్రాం నీకు ఎవరు ఇచ్చారు అని అడిగారు వాళ్ళే పిలిచారు అని చెప్పాను. వాళ్ళు కనీసం నాకు యాంకర్ ని మారుస్తున్నామన్న విషయమే చెప్పలేదు. నాకు చెప్తే నేను చేసేవాడిని కదా..నాకు రావాల్సిన డబ్బులు ఉండొచ్చు...ఏదైనా కారణం ఉండొచ్చు. వాళ్ళు నాకు ఏ విషయాన్నీ చెప్పలేదు. నువ్వు కూడా నాకు చెప్పలేదు అనేసరికి అప్పటికి నాకు కొత్త నేను అంత దూరం ఆలోచించేవాడిని కాదు. అలా అనుకోకుండా నా వల్ల ఒక తప్పు జరిగింది. తర్వాత ఆయన ఆ విషయం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు". అని చెప్పాడు రాకెట్ రాఘవ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



