సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా.. ప్రొడ్యూసర్స్ వల్లే డిస్ట్రిబ్యూటర్స్ నాశనమవుతున్నారు
on Nov 26, 2022

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. ఆయన ఎంత పాపులారిటీని అందుకున్నాడో అన్ని విమర్శలు కూడా ఆయన్ని వెంటాడుతూ ఉంటాయి. లేటెస్ట్ గా ఆయన సినిమా గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. చిన్నప్పటినుంచి తనను ఇంట్లో రాజు అని పిలవడం అలవాటు. దిల్ సినిమా హిట్ అయ్యేసరికి దిల్ రాజు అని అందరూ పిలవడం మొదలు పెట్టారని చెప్పాడు. ఇక ప్రొడ్యూసర్ గా తన జర్నీ స్టార్ట్ చేసి 20 ఏళ్లయ్యిందని చెప్పాడు.
సినిమా మొత్తం ఒక మాయ అని డిస్ట్రిబ్యూటర్లకు మూవీని చూపించకుండానే గాల్లో దీపంలా అమ్మేస్తారని చెప్పుకొచ్చాడు. ప్రొడ్యూసర్ల వల్ల డిస్ట్రిబ్యూషన్ రంగం మొత్తం నాశనమవుతోందంటూ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేసాడు. ఇక సినిమా అనే పదానికి అర్ధం చెబుతూ సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం లేనిది కాబట్టే సినిమా అనే పేరొచ్చిందని చెప్పాడు. ఇక వారసుడు వివాదం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ఈ వివాదాలను ఎవరు సృష్టిస్తున్నారో తనకు బాగా తెలుసనీ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



