తండ్రి బర్త్ డే.. ఆది విలనిజం డే!
on Jun 24, 2022

`సరైనోడు`, `రంగస్థలం` చిత్రాలతో తెలుగునాట నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు ఆది పినిశెట్టి. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, విలన్ గానూ ఆకట్టుకున్న ఆది.. ఇటీవలే ఒక ఇంటివాడయ్యాడు. కాగా, త్వరలో ఆది పినిశెట్టి ఓ ఆసక్తికరమైన చిత్రంతో పలకరించబోతున్నాడు. ఆ సినిమానే.. `ద వారియర్`. కాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ బైలింగ్వల్ మూవీలో రామ్ పోతినేని కథానాయకుడిగా నటించగా.. ప్రతినాయకుడి పాత్రలో సందడి చేయనున్నాడు ఆది పినిశెట్టి. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూలై 14న జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జూలై 14 ఆది పినిశెట్టి తండ్రి, ప్రఖ్యాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు. తన కెరీర్ లో ఇప్పటివరకు తండ్రి బర్త్ డే స్పెషల్ గా ఆది చిత్రాలు విడుదలైన సందర్భం లేదు. ఫస్ట్ టైమ్ `ద వారియర్`తో ఆ ముచ్చట తీరనుంది. మరి.. నాన్న రవిరాజా పినిశెట్టి బర్త్ డే (జూలై 14) స్పెషల్ గా థియేటర్స్ లో ప్రదర్శించనున్న విలనిజం.. ఆది పినిశెట్టి కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



