రేణు దేశాయ్, అకిర నందన్ ఇద్దరికీ కొవిడ్ 19 సోకింది!
on Jan 11, 2022

మొదటి, రెండు కరోనా వేవ్‌లను దాటిన టాలీవుడ్ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్లు కొవిడ్ థర్డ్ వేవ్‌కు తలవంచుతున్నారు. గత వారం రోజులుగా వరుసబెట్టి టెస్టుల్లో కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలుతున్నారు. లేటెస్ట్‌గా కొవిడ్ బాధితులయ్యారు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, కుమారుడు అకిర నందన్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్ ద్వారా ఆమె వెల్లడించారు.
Also read: ఖుష్బూకు కరోనా.. టూ వేవ్స్ తప్పించుకున్నా.. థర్డ్ వేవ్‌లో దొరికిపోయా!!
"ఎక్కువ రోజులు ఇంట్లోనే గడుపుతున్నప్పటికీ, కొత్త సంవత్సరం ఇంట్లోనే ఉన్నప్పటికీ, కొద్ది రోజుల క్రితం లక్షణాలతో అకిర నందన్, నేను కొవిడ్ 19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నాం. దయచేసి ఈ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకొనమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మాస్కులు ధరించండి.. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. (నేను గతేడాది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇప్పుడు అకిరకు వ్యాక్సిన్ వేయించాలనుకున్నాను. కానీ దానికంటే ముందు తనకి పాజిటివ్ అని తేలింది.)" అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు రేణు.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే తన ఇద్దరు పిల్లలు అకిర నందన్, ఆద్యతో కలిసి నివాసం ఉంటున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక తమ ఇంట్లోనే వారు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2012లో పవన్ కల్యాణ్ నుంచి రేణు విడిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



