OG మూవీని పవన్ ఎందుకు స్టార్ట్ చేశాడు?
on Feb 7, 2023
టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ రన్ రాజా రన్ తర్వాత ప్రభాస్తో బాహుబలి తర్వాత మొదటి చిత్రంగా సాహో చిత్రం తీశారు. తన మూడవ చిత్రంతోనే అరుదైన పవన్ కళ్యాణ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఓ జి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఓ జీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. దీనిని బట్టి ఇది గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందుతున్నచిత్రం అని క్లారిటీ వస్తోంది. ఆర్ఆర్ఆర్ తరహాలో ఈ చిత్రాన్ని కూడా ఓజీ గా ప్రమోట్ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్ లేకుండా సుజిత్ తీస్తున్నాడట. దాంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఓ జి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా తెలియని ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనేటైటిల్‌ను బట్టే ఇది మాఫియా, గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రూపొందే చిత్రం అని అర్దమవుతోంది.
చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. హరిష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందు సుజిత్ సినిమాని పవన్ ఎందుకు స్టార్ట్ చేశాడు? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. హరిహర వీర మల్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ రెడీగా ఉంది. ఇన్ని ప్రాజెక్టులు లైన్‌లో పెట్టి ఆలస్యంగా కమిట్ అయిన సుజిత్ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లడం వెనుక వేరే కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమాకి కేవలం 25 నుంచి 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే చాలని సుజిత్ పవన్ ను కోరాడట. ఈ తక్కువ సమయంలోనే ఆయన సినిమా పూర్తి చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. అందుకే పవన్ ముందుగా సుజిత్ సినిమాను ప్రారంభించారని అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
