రజినీకాంత్‌తో మహేష్‌కి చెక్ పెట్టబోతున్న దిల్ రాజు!
on Feb 7, 2023
డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను ప్రారంభించిన దిల్ రాజు చాలా తక్కువ సమయంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కథల ఎంపికలో ఆయన జడ్జిమెంట్ చాలా బాగా ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. యాక్షన్ సినిమాలను పక్కన పెడితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చిత్రాలను ఈయన బాగా జడ్జి చేయగలరని నమ్మకం ఉంది. నిర్మాతగా ఎంతగా ఎదిగినా కూడా ఈయన డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని మాత్రం వదలలేదు. ఈయనకు నైజాం, వైజాగ్ ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ గా చాలా పట్టు ఉంది. ఎన్నో థియేటర్లో ఈయన చేతిలో ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఆయన విజయ్తో వారసుడుగా వచ్చారు. కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాంతో దీనికి కారణాలను విశ్లేషించే పనిలో దిల్ రాజు ఉన్నారు. తాజాగా ఆయన చూపు ఇండియన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ పై పడింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సునీల్, తమన్నా భాటియా వంటి భారీ తారాగాణం నటిస్తుంది.
ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలలో కొనడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు అని సమాచారం. అదే రోజున మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఎస్ఎస్ఎంబి 28 కూడా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజుకు ఇవ్వకుండా ఏషియన్ ఫిలిమ్స్ కి ఇవ్వాలని ఈ చిత్ర నిర్మాత చిన్నబాబు అలియాస్ కే రాధాకృష్ణ భావిస్తున్నారు. దాంతో మహేష్ బాబు చిత్రానికి చెక్ పెట్టేలా ఈసారి రజినీతో ఆగస్టు 11న థియేటర్లలో నువ్వా నేనా అన్నట్లుగా దిల్ రాజు పోటీ పడబోతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రాల రిలీజ్ డేట్లపై క్లారిటీ రావాల్సివుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
