అందుకే 'జన గణ మన' ఆగిపోయిందా?
on Sep 4, 2022
.webp)
పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన'ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అప్పట్లో మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఆ తర్వాత వాయిదా పడుతూ పడుతూ చివరికి విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 'లైగర్' దెబ్బకి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
విజయ్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న బయ్యర్లు భారీస్థాయిలో నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ పరాజయం ప్రభావం 'జన గణ మన'పై పడిందట. నిజానికి 'లైగర్' విడుదలైనప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ ని ఆపేయాలని విజయ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేయాలని పూరినే నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'జన గణ మన'ను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. కానీ 'లైగర్' ఘోర పరాజయం పాలవడంతో బయ్యర్లకు 30 శాతం దాకా డబ్బులు తిరిగిచ్చి కొంత లాస్ ని కవర్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుత పరిస్థితి, బడ్జెట్ లెక్కలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి 'జన గణ మన'ను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



