
‘రంగస్థలం’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
‘RC17’ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ ఏడాది చివర్లోనే కెమెరా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, హీరోయిన్, సంగీత దర్శకుడు వంటి విషయాలపై కూడా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అయితే పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.!
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నెమలి ఈక ఉండటంతో ఇది శ్రీకృష్ణుడి నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలైతే, కొత్త ఏడాదిలో ఈ సినిమా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను సుకుమార్ మరోసారి రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!
చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!
[RC17 Shooting Update, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers]






