Home

»

Latest News

టిల్లు మావ కొత్త సినిమా: సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

Nov 11, 2026 4:58PM


డిజె టిల్లు సిద్దు జొన్నలగడ్డ ప్రీవియస్ చిత్రాలని పరిశీలిస్తే వరుస పరాజయాలు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒకింత బెంగ మొదలైంది. అంతలా డిజె టిల్లు, టిల్లు స్క్వేర్  తో మెస్మరైజ్ చేసాడు. ఈ సారి హిట్ అంటూ కొత్త మూవీ స్టార్ట్ చేసాడు


ఆయన కొత్త చిత్రం ‘సిద్ధు 10’ అనే వర్కింగ్ టైటిల్‌తో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. దర్శకుడు బుచ్చిబాబు, దర్శకురాలు సందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇందులో సిద్ధుకు జోడీగా నయన్ సారిక నటించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి మోహన్ బి దర్శకత్వం వహించనున్నారు. జి వి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. సుకుమార్ రైటింగ్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


ఈసారి మరింత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తాజా ప్రాజెక్ట్ చాలా యూనిక్ ప్లాట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్,లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ఇదేనా: ఆ స్టార్ అంట!
 

సినిమా రంగంలో ప్రయోగాత్మక కథలకు ఎప్పుడూ ముందుండే సిద్ధూ జొన్నలగడ్డ, కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన లైనప్‌లో సోషియో ఫాంటసీ జానర్ మూవీతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సిద్ధూ నుంచి వస్తున్న ఈ అప్‌డేట్  అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

మీకు నచ్చవచ్చు:సెన్సేషన్ సృష్టిస్తున్న సూర్య ! 
మీకు నచ్చవచ్చు: శ్రీకాంత్ కొడుకు వచ్చేస్తున్నాడు!

 

[Siddhu Jonnalagadda, Nayan Saarika, Allu Aravind, Telugu Cinema, TeluguCinema News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com