
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న వార్త కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఈ క్రమంలో సినిమా పూజా కార్యక్రమంలో తమిళ నటుడు రిషికాంత్ కనిపించడంతో.. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడా? అనే చర్చ మొదలైంది.
ముఖ్యంగా ఇటీవల ‘మొదరాత్రి’, ‘డొరోతీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రిషికాంత్.. ‘RC17’లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, విలన్‌గా నటించనున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా రిషికాంత్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
రిషికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ‘మొదరాత్రి’ సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమా ద్వారా నిర్మాతలతో ఏర్పడిన పరిచయం కారణంగా, రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమానికి మైత్రీ నిర్మాతలు ఆయనను ఆహ్వానించారట. అందుకే వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరయ్యానని స్పష్టం చేశారు.

తాను ‘RC17’లో నటించడం లేదని రిషికాంత్ తేల్చి చెప్పాడు. సినిమా విడుదలైన తర్వాత అందులో తాను లేనని తెలిసి ప్రేక్షకులు నిరాశ చెందడం కంటే.. ముందుగానే అసలు విషయం చెప్పడం మంచిదని భావించినట్లు వెల్లడించాడు. అనవసరమైన ఊహాగానాలు చేయొద్దని మీడియా, అభిమానులను కోరాడు. దీంతో ఆయన పాత్రపై వస్తున్న ప్రచారానికి తెరపడింది.
ఇది కూడా చదవండి: ఇస్కాన్ ఫౌండర్ బయోపిక్.. హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ మూవీ.!
ఇక ‘RC17’ విషయానికి వస్తే.. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. నవంబర్ 1న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి తొలి క్లాప్ కొట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పిస్తోంది. సినిమా కథ, నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మీకు నచ్చవచ్చు:
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
చరిత్ర సృష్టించిన ‘వారణాసి’.. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డీల్.!
[Actor Rishikanth About RC17, RC17 Pooja Ceremony, Ram Charan Sukumar Movie, RC17 Movie, Mythri Movie Makers, Modha Rathiri Movie, Dorothy Movie, Ram Charan, Sukumar, Telugu Film News]






