
బాబుమోహన్.. ఈ పేరుకి ఉన్న చరిష్మా తెలుగు సినిమా ఉన్నంత కాలం వెలుగొందుతూనే ఉంటుంది. బాబు మోహన్ తమ సినిమాలో ఉండేలా చూడు అని ఇష్టదైవాల్ని ప్రార్ధించని హీరో లేడనే టాక్ కూడా తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తరచూ వినపడుతూ ఉండేది.
అలాంటి బాబు మోహన్ తాజాగా టాలీవుడ్ మోస్ట్ అంటెన్సివ్ చిత్రమైన 'ది ప్యారడైజ్' సినిమా యూనిట్ పై అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన చేదు అనుభవాలను, మేకర్స్ వ్యవహరించిన తీరును బహిరంగంగానే వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇటీవలి కాలంలో సినిమాలని బాగా తగ్గించి, అత్యంత సెలెక్టివ్‌గా నటిస్తున్న బాబు మోహన్ 'ది ప్యారడైజ్' చిత్రంలో ఒక కీలకమైన మరియు మంచి క్యారక్టర్ కోసం దర్శకుడు, చిత్ర యూనిట్ తనని స్వయంగా సంప్రదించారని గుర్తు చేసుకున్నారు.
తన వద్దకు వచ్చిన ఆ రోల్ కోసం స్వయంగా లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, గెటప్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆ సమయంలో ఎంతో అభినందించారని ఆయన తెలిపారు. షూటింగ్ ప్రారంభం కాగానే వెంటనే పిలుస్తామని, పనులన్నీ పూర్తి కాగానే కబురు పెడతామని చెప్పి యూనిట్ పెద్దలు నమ్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఆ తర్వాత చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా, కనీసం ఫోన్ చేసి చెప్పే మర్యాద కూడా పాటించలేదని బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిలుపు వస్తుందని, షూటింగ్‌కి రమ్మంటారని ఎంతో ఆశగా ఎదురుచూసిన తనను చివరికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టేశారని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: టిల్లు మావ కొత్త సినిమా: సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
తనలాంటి అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడిని ఇలా గెటప్ వేసి, లుక్ టెస్ట్ చేసి అర్ధంతరంగా పక్కన పెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన మధనపడ్డారు. నటీనటులకు కనీస గౌరవం ఇవ్వని వారికి దరిద్రం, శని వెంటపడతాయని, అందుకే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని కొంచం ఘాటుగానే విమర్శించారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మీకు నచ్చవచ్చు:రామాయణ సౌత్ కలెక్షన్స్ ఇంతే!
మీకు నచ్చవచ్చు: రంగంలోకి చిరంజీవి: ఫ్యాన్స్ లో కోలాహాలం!
[Babu Mohan , Nani, the Paradise, Kayadu Lohar, Mohan Babu]






