ఆ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక: రష్మిక
on May 13, 2021

కన్నడ భామ 'రష్మిక మందన్నా'కు తమిళ ఇంటి కోడలు కావాలని కోరికగా ఉందట. ఈ విషయమై తాజాగా రష్మిక మాట్లాడుతూ.. తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టమని.. తమిళ సంప్రదాయం, సంస్కృతి తనను ఎంతగానే ఆకర్షించిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అక్కడి వంటకాలు అంటే అమితమైన ఇష్టమని చెప్పింది. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని మనసులోని మాట బయటపెట్టింది. మరి తమిళ ఇంటి కోడలు కావాలన్న రష్మిక కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
ఇక కెరీర్ విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో నటిస్తోంది. రష్మిక ఓ వైపు తెలుగులో దూసుకెళ్తూనే మరోవైపు కోలివుడ్ పై కన్నేసింది. ఇటీవల కార్తీ నటించిన 'సుల్తాన్' సినిమా ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మిక పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా నటించి తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలోనే రష్మిక తాజాగా మాట్లాడుతూ తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



