మా ఆయనకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్ని: హేమ
on May 13, 2021

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో పూరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేవాడని, అప్పట్నుంచి బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉండేవాళ్లమని తెలిపారు. పూరికి ఎప్పుడైనా డబ్బు అవసరమైతే తననే అడిగివాడని.. మా ఆయనకు తెలియకుండా ఐదందలు, వెయ్యి ఇలా పోపు డబ్బాల్లో దాచుకొని పూరికి ఇచ్చేదాన్ని అని చెప్పారు. ఆ టైంలో మా ఆయన ఒక్కరే వర్క్ చేసేవారని, దీంతో ఉన్నదాంట్లోనే మా ఆయనకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్నని తెలిపారు. అలా ఎప్పుడు డబ్బు అవసరం ఉన్నా పూరి తనని అడిగేవాడని, మళ్లీ తిరిగి ఇచ్చేవాడని హేమ గుర్తుచేసుకున్నారు.
అంతేకాకుండా పూరి ప్రేమించిన అమ్మాయితో తామే దగ్గరుండి పెళ్లి చేశామని, కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశామని హేమ పేర్కొన్నారు. ఓ షూటింగ్ లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పరిచయం చేశాడని చెప్పారు. ఆ టైంలో పెద్దవాళ్లు ఎవరూ లేకపోతే తన భర్తతో కలిసి దగ్గరుండి కాళ్లు కడిగి కన్యాదానం చేశానని, అలా పూరికి తాను అక్కతో పాటు అత్తనవుతాను అని హేమ తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



