నవ్వుతూనే లేజర్ స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకున్న యాంకర్ రష్మీ
on Dec 9, 2022
రష్మీ గౌతమ్ ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తోంది. ఆమె కూడా కొంత బ్రేక్ రాగానే టాప్ స్టార్స్ లాగా టూరింగ్ స్పాట్స్ కి వెళ్లి ఆ పిక్స్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది. ఇక ఇప్పుడు రష్మీ మాల్దీవ్స్ కి వెళ్ళాక అక్కడ బీచ్ లో, బోట్ పై.. రిసార్ట్ లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. మాల్దీవ్స్ లో మరింత అందంగా మురిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా రష్మీ లేజర్ స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంది. ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి వీడియో ఒకదాన్ని తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసుకుంది. ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో తనను డాక్టర్స్ ఎంతో సేఫ్ గా, హ్యాపీగా ఉండేలా చూసుకున్నారట.
దాని కారణంగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఈజీ అయ్యింది అంది రష్మీ. రీసెంట్ గా మాల్దీవ్స్ వంటి ప్లేసెస్ లో రష్మీ పర్యటించిన విషయం తెలిసింది. టూర్ అయ్యాక తన స్కిన్ మొత్తం వేడి, మంటతో బాగా డీహైడ్రేట్ ఐపోయి నిర్జీవంగా ఉండడం వలన ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పింది. అప్పుడే ఈ వీడియోని షూట్ చేసారంటూ చెప్పింది రష్మీ..ఇక ఈ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నంత ఆమె నవ్వుతూనే ఉంది.