జిమ్‌లో దొరికిపోయిన మహేష్ బాబు!
on Dec 9, 2022

మహేష్ బాబు సినిమా పనుల్లోకి తిరిగి వచ్చారు. ఆయన జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. మహేష్ జిమ్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు రావడంతో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన మహేష్ ఫ్యాన్స్ లుక్ సూపర్ అంటూ ఫిధా అవుతున్నారు. తన తల్లిదండ్రుల మరణానంతరం కాస్త డిప్రెషన్‌లో ఉన్న మహేష్ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎస్‌ఎస్‌ఎంబీ 28 సినిమా గురించి రోజుకు ఒక అప్ డేట్ హల్ చల్ చేస్తూనే వుంది. SSMB28 అతి త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసమే మహేష్ బాబు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు.
గతంలో మహేష్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘అతడు, ఖలేజా’ మూవీలు వచ్చాయి. ‘అతడు’ హిట్ అవగా, ‘ఖలేజా’ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB28 షూటింగ్ మాత్రం సంక్రాంతి తర్వాతే అంటున్నారు చిత్ర యూనిట్. ఎస్‌ఎస్‌ఎంబీ 28 లో మహేష్‌కి జంటగా మెయిన్ హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుండగా శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ఐటెం సాంగ్‌లో భామ రష్మిక మందన్నా కనిపించనుందని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



