హారర్ కామెడీ సెట్‌లో రాశీ ఖన్నా...
on Feb 28, 2020

రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ రోల్ కాకుండా ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో రాశీ ఖన్నా నటించారు. కాలేజ్ ఎపిసోడ్స్‌లో తప్ప మ్యాగ్జిమమ్ సీన్స్‌లో ఏడుస్తూ కనిపించారు. బోల్డ్ సీన్స్ చేయడానికి వెనుకడుగు వేయలేదు. ఆర్టిస్ట్‌గా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ, రిజల్ట్ రివర్స్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా బోల్తా కొట్టింది. హీరో, ప్రొడ్యూసర్ మధ్య ఏవో సెటిల్‌మెంట్ ఇష్యూలు నడుస్తున్నాయనుకోండి. అవి పక్కన పెడితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదల తర్వాత రాశీ ఖన్నా పెద్ద కనపడలేదు. రీసెంట్‌గా మళ్లీ తమిళ సినిమా ‘ఆరణ్మనై 3’ సెట్స్‌లో కనిపించారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో మూడో సినిమా ఇది. ప్రజెంట్ షూటింగ్ జరుగుతోంది. తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో అని సెట్స్‌లో వెయిట్ చేస్తున్న ఫొటోను రాశీ ఖన్నా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. చూస్తుంటే అందులో మోడ్రన్ అమ్మాయి రోల్ చేస్తున్నట్టున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



