రంగస్థలానికి రీషూట్లు.. మార్చి 30కి డౌటేనా..?
on Feb 21, 2018

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వంలో మొదలైన రంగస్థలం అసలు షెడ్యూల్ ప్రకారం దీపావళికి రావాలి.. సమ్మర్‌లో వడగాల్పులు, యూనిట్‌లో కొందరికి ఆరోగ్యం బాగోకపోవడం.. దీనికి తోడు తండ్రి సినిమా నిర్మాణ పనుల్లో చరణ్ బిజీగా ఉండటంతో.. షూటింగ్ లేటయ్యింది. చివరకు నవంబర్ నుంచి డిసెంబర్‌కు చివరకి చివరకు మార్చి 30కి రంగస్థలం డేట్ ఫిక్సయ్యింది. రెండు టీజర్లు, ఒక పాటతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
అయితే లేటేస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం రంగస్థలానికి కొన్ని రీషూట్లు చేయాలనుకుంటున్నాడట సుకుమార్. చరణ్ సినిమాకు కర్త, కర్మగా వ్యవహరించే మెగాస్టార్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసిన మెగాస్టార్ కూడా.. కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేయాలని చెప్పడంతో.. మళ్లీ చిత్ర యూనిట్ షూటింగ్‌కు రెడీ అయ్యిందట. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో నాలుగు రోజుల పాటు రంగస్థలానికి మెరుగులు దిద్దబోతున్నాడట సుక్కు. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి రిలీజ్ డేట్ మళ్లీ మార్చరు కదా.? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



