ఫేస్‌బుక్ చీఫ్‌కే షాకిచ్చిన ప్రియా వారియర్
on Feb 22, 2018

ఒక్క కన్ను కొట్టి రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది కేరళ కుట్టీ ప్రియా ప్రకాశ్ వారియర్. మళయాళ సినిమా "ఒరు ఆదార్ లవ్"లోని "మాణిక్య మలరాయ పూవీ" పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్ లుక్స్‌తో యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. ముఖ్యంగా యూత్ అయితే ప్రియా జపం చేస్తున్నారు. ఒక వారం పాటు గూగుల్, యూట్యూబ్ సహా సోషల్ మీడియా మొత్తం ఈ ముద్దుగుమ్మ వార్తలతో నిండిపోయింది. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు, స్టార్ హీరోల విషయాల కన్నా ప్రియాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం బాగా వెతికారు. ఒక దశలో ఈమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.
ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలీయోన్‌ను క్రాస్ చేసిన ప్రియా.. తాజాగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ని మించిపోయింది. జుకర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే వారియర్‌కు 4.5 మిలియన్ల మందికి పైగా ఉన్నారు. ఆమె ఏదైనా ఫోటో పోస్ట్ చేసినా లేదంటే వీడియో అప్‌డేట్ చేసినా మిలియన్స్‌లో లాకులు, వ్యూస్ వస్తున్నాయి. ప్రియా స్పీడ్ ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే టాప్ సెలబ్రిటీల ఫాలోవర్స్‌ను.. దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



