ముద్దు పెట్టే ప్రసక్తే లేదంటున్న స్టార్ హీరో...!
on May 12, 2016

ఏదో సినిమాకు గ్లామర్ ప్లస్ పబ్లిసిటీ యాడ్ అవుతుంది కదా అని వాళ్లిద్దర్నీ తన సినిమాలో పెట్టుకున్నాడు అనురాగ్ బసు. కానీ చివరికి తనకే ఇలా చుక్కలు చూపిస్తారని మాత్రం అనుకోలేదు పాపం. రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ లిద్దరూ ఒకప్పుడు లవర్స్. కానీ బ్రేకప్ అయిన తర్వాత మాత్రం ఇద్దరికీ మధ్య ఏమాత్రం సయోధ్య కుదరట్లేదట. వీళ్లిద్దర్నీ తన సినిమా జగ్గాజాసూస్ కు లీడ్ పెయిర్ గా తీసుకుంటే, మంచి పబ్లిసిటీతో పాటు సినిమాకు క్రేజ్ యాడ్ అవుతుంది కదా అని ఆనుకున్నాడు అనురాగ్. అయితే వీళ్లిద్దరూ కలిసి అతనికి పట్టపగలే నక్షత్రాల్ని చూపిస్తున్నారు.
షూటింగ్ సందర్భంగా, ఒక పాట లో ఇద్దరికీ మధ్య ఘాటు ముద్దు సీన్ ఉందట. అయితే రణ్ బీర్ నేను ముద్దు పెట్టను గాక పెట్టను అంటూ ఖరాఖండిగా చెప్పేశాడట. స్క్రిప్ట్ మార్చుకో తప్ప కత్రినాతో ముద్దు సీన్ మాత్రం చేసేది లేదని కుండ బద్ధలుగొట్టేశాడట. దీంతో అనురాగ్ కు ఆ సీన్ మార్చక తప్పలేదు. షూటింగ్ కోసం మూవీ టీం అంతా ఫారిన్ వెళ్తుంటే, రణ్ బీర్ తో కలవడం ఇష్టం లేక, కత్రినా వేరే ఫ్లైట్ లో వచ్చిందట. ఇలా ఉప్పు నిప్పులా ఉన్న వీళ్లిద్దరి మీదా తీస్తున్న ఈ సినిమా చివరికి తెరపై ఎలా వస్తుందో అని అనురాగ్ అండ్ కో కు చెమటలు పడుతున్నాయట. సినిమా రిలీజ్ అయితే తప్ప ఎలా వచ్చిందో తెలీదు మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



