ఆ జాతిని మైలు దూరం పెట్టండి..చిరుకి వర్మ సలహా
on Aug 11, 2023

ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వ అధికార పెద్దలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన అనుచరులు చిరంజీవిని డైరెక్ట్‌గా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే కామెంట్స్ చేయటానికి రెడీగా ఉండే దర్శకుడు ఆర్జీవీ. ఆయన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంటారు. వీలున్నప్పుడల్లా మెగా ఫ్యాన్స్‌ని గిల్లుతుండే ఈయన మరో మారు తనదైన స్టైల్‌ను చూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. చిరంజీవి రీమేక్స్ చేయటంపై ఆయన ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’’ అని చిరంజీవికి వర్మ సలహా ఇచ్చారు. పర్టికులర్‌గా ఆయన ఈ సలహా ఇవ్వటం వెనుక చిరంజీవి వెనుక ఉండే వ్యక్తులు అని కూడా చెప్పేశారు.
రీసెంట్‌గా జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని హైపర్ ఆది ఓ రేంజ్‌లో పొగిడేశాడు. ఆ సమయంలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్జీవీ కామెంట్స్ చేశారు. దీనిపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా భోళా శంకర్ తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



