చరణ్ కోపానికి బలైన హీరోయిన్
on Jan 24, 2017

టాలీవుడ్ అంటేనే హీరోల రాజ్యం. ఇక్కడ వాళ్లేం చెబితే అదే జరుగుతుంది. హీరోలకు ఇష్టమైన వాళ్లే టీమ్ లో ఉంటారు. మిగిలిన వాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోవాల్సిందే. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ విషయంలోనూ అదే జరిగింది. అఆ, శతమానం భవతి చిత్రాలతో ఆకట్టుకొన్న హీరోయిన్ అనుపమ. ఇప్పుడు వరుసగా ఆఫర్లు అందుకొంటోంది. అందులో భాగంగానే చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైంది అనుపమ. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా అనుపమకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు చరణ్. ఈ సినిమా నుంచి అనుపమని తీసి పక్కన పెట్టాడు. దాంతో అనుపమకు దిమ్మతిరిగిపోయింది.
ఈ సినిమా కోసం సుకుమార్ కొన్ని ప్రీ సెషన్స్ నిర్వహించాడట. చరణ్, అనుపమలతో ఓ ఫొటో షూట్ కూడా చేశారని తెలుస్తోంది. ఆ సందర్భంగానే అనుపమ బిహేవియర్ చరణ్‌కి నచ్చలేదని, అందుకే తనని పక్కన పెట్టేశాడని సమాచారం. ఈ విషయంలో అనుపమ వివరణ ఇవ్వడానికి ట్రై చేసినా చరణ్ వినలేదట. మరి చరణ్ అంతగా కోపం తెచ్చుకొనేలా అనుపమ ఏం చేసిందనేది ఇండ్రస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



