ఫ్యామిలీస్‌తో మీనా ఇంట్లో సందడి చేసిన నిన్నటి తరం గ్లామరస్ హీరోయిన్స్!
on Aug 8, 2022

మీనా భర్త సాగర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీనంతా షాక్‌కు గురిచేసింది. ఎంతో ఆనందకరంగా దాంపత్య జీవనం గడుపుతున్న మీనాకు భర్తను కోల్పోవడం ఇంకెలా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఇలాంటి క్లిష్ట కాలంలో ఆమెకు స్నేహితులు, సన్నిహితుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. నీకు మేమున్నామంటూ వారంతా ఆమెకు ధైర్యాన్నిచ్చారు.
జూన్‌లో ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకి సాగర్ మృతి చెందారు. ఆ తర్వాత మీనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను రెండంటే రెండు సార్లు మాత్రమే ఉపయోగించి, తన భర్త సాగర్ గురించి షేర్ చేసుకుంది. ఇప్పుడు తన స్నేహితులు, సహ నటీమణులతో కలిసి వున్న ఓ ఫొటోను ఆమె షేర్ చేసింది. తమ కుటుంబాలతో రంభ, సంగీత, సంఘవి ఆమె ఇంటికి వచ్చి, కొద్దిసేపు ఆనందంగా గడిపారు. దానికి సంబంధించిన గ్రూప్ ఫోటోను మీనా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

90వ దశకంతో పాటు 2000ల మొదట్లో ఈ తారలంతా ఓ వెలుగు వెలిగారు. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. పోటీ ఉన్నప్పటికీ అప్పట్నుంచీ కూడా వారు స్నేహితులుగా కొనసాగుతూనే వచ్చారు. రంభ యు.ఎస్.లో నివాస ఉంటూ, ఇటీవల చెన్నైకి వచ్చింది. సంగీత, సంఘవి ఆమెకు తోడయ్యారు. అందరూ కలిసి తమ పిల్లా పాపలతో మీనా ఇంటిని సందర్శించారు. వారి రాకతో మీనా, ఆమె పిల్లలు హ్యాపీగా ఫీలయ్యారు. అందరూ కలిసి కొంత క్వాలిటీ టైమ్‌ను గడిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



