రవితేజ తమ్ముని కుమారుడు హీరోగా పరిచయమవుతున్న 'ఏయ్.. పిల్లా'
on Aug 9, 2022

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్నాడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఏయ్... పిల్లా' టైటిల్ ఖరారు చేశారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇది లుధీర్ బైరెడ్డి ఈ మూవీని రూపొందిస్తున్నాడు. అతనికి దర్శకునిగా ఇదే తొలి చిత్రం. ఈ చిత్రానికి ఖిలాడి డైరెక్టర్ రమేశ్ వర్మ కథను అందిస్తుండటం విశేషం.
ఈ మూవీ గురించి నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ ''హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు.
'ఏయ్... పిల్లా' చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: అన్వర్, కూర్పు: ప్రసన్న, కళ: చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గణేష్ ముప్పానేని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



