'రామారావు ఆన్ డ్యూటీ' థియేట్రికల్ బిజినెస్ ఇంత తక్కువా!
on Jul 27, 2022

కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. ఈ ప్రభావం విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల థియేట్రికల్ బిజినెస్ పైన పడుతుంది. మాస్ మహారాజ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కూడా చేయకపోవడం గమనార్హం.
గతేడాది 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఈ ఏడాది ఇప్పటికే 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దాదాపు రూ.23 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో రూ.14 కోట్ల లోపు షేర్ తో సరిపెట్టుకొని పరాజయం పాలైంది. ఆ ప్రభావం ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ'పై పడింది. దానికితోడు ఓటీటీలు, అధిక టికెట్ ధరలు, వీక్ కంటెంట్ ఇలా పలు కారణాలతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించడంతో.. కొద్ది వారాలుగా దాదాపు అన్ని సినిమాలు బయ్యర్లకు నష్టాలను మిగుల్చుతున్నాయి. ఈ దెబ్బతో టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నప్పటికీ 'రామారావు ఆన్ డ్యూటీ' థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
నైజాంలో రూ.5 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.7 కోట్ల బిజినెస్ చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.15 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 1 కోటి, ఓవర్సీస్ లో 1.20 కోట్లు కలిపి ఓవరాల్ గా రూ.17.20 బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వస్తే 17-18 కోట్లు అనేది కేక్ వాక్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందనేది అంచనా వేయడం కష్టంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



