'జగత్ జజ్జరిక'.. 'బింబిసార' రిలీజ్ ట్రైలర్ అదిరింది!
on Jul 27, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన 'బింబిసార' రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజువల్స్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. "హద్దులను చెరిపేస్తూ, మన రాజ్యపు సరిహద్దులను ఆపే రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదురు తిరిగితే మరణం" అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. బింబిసారుడు కత్తి పట్టి యుద్ధం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ చివరిలో "జగత్ జజ్జరిక" అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదిలా ఉంటే 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ జూలై 29న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో తారక్ స్పీచ్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



