బాలయ్యకు ఏం రేంజ్ స్వాగతం చెప్పారో చూశారా..?
on Jun 6, 2016

ఈ ఫోటో చూశారా..ఫ్రంట్ కూర్చుని అభివాదం చేస్తున్నది నందమూరి బాలకృష్ణ. వెనుక వస్తున్నది ఆయన కాన్వాయ్. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లోని హైవే మీద అనుకుంటే మీరు పొరబడ్డట్టే. అమెరికాలోని సీటెల్ లో ఈ సంఘటన జరిగింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం నిథులు సేకరించడానికి అమెరికాలో పర్యటిస్తున్నాడు బాలయ్య. ఆయన అక్కడకు చేరుకున్న క్షణం నుంచి, అమెరికాలో పర్యటించే వరకూ అన్నీ భారీగా, ఆయన స్థాయికి తగ్గట్టుగా ఎరేంజ్ చేశారు బాలయ్య అభిమానులు.

ఇంతవరకూ మన హీరోలెవరికీ ఈ రేంజ్ వెల్ కమ్ దొరకలేదని చెప్పచ్చు. పూర్తి రాజమర్యాదలతో లెజండ్ ను అక్కడి అభిమానులు రిసీవ్ చేసుకున్న తీరు గురించే ఇప్పుడు ప్రతీచోటా చర్చ. బాలయ్య అభిమానులైతే ఫేస్ బుక్ లో ఈ వీడియో చూసి పులకరించిపోతున్నారు. ముందు బండిమీద లెజండ్ అన్న డ్రస్ వేసుకున్న బైకర్ వెళ్తుంటే, వెనకాల ఆరు, ఏడు కార్ల కాన్వాయ్ కదిలి వెళ్తుంటే...అబ్బో అదంతా వేరే లెవెల్లో ఉందిలే..బాలయ్య కూడా తన అభిమానులతో సెల్ఫీ దిగుతూ, వాళ్లతో సంతోషంగా మాట్లాడుతూ కనిపించడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



